RR vs RCB ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 60వ మ్యాచ్ ప్రివ్యూ
RR vs RCB ప్రిడిక్షన్ 2023 (RR vs RCB Prediction 2023) : IPL సీజన్ 2023లో జరిగే మ్యాచ్‌లో టీమిండియా యొక్క ఇద్దరు ముఖ్య బ్యాట్స్మెన్లు కల్గిన జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అందులో ఒకరు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యొక్క మాజీ కెప్టెన్ మరియు టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లి కాగా, మరొకరు రాజస్థాన్ రాయల్స్ యొక్క కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల ప్రదర్శన ఒక సారి బాగుంటే, మరొక సారి దరిద్రంగా ఉంటుంది. ఒకవైపు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 3వ స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
RR vs RCB ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- వేదిక: జైపూర్ స్టేడియం
- తేదీ & సమయం : మే 14 & 3:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
RR vs RCB ప్రిడిక్షన్ 2023 : గెలుపుతో 3వ స్థానానికి వెళ్లిన RR
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచుల్లో 6 విజయాలు నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయితే, రాజస్థాన్ నెట్ రన్ రేట్ చాలా బాగుండటం వల్ల పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఇప్పుడు కోల్‌కతా మీద గెలిచి మూడవ స్థానానికి చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో గెలిచింది అనుకున్న తరుణంలో నో బాల్ రూపంలో ఓటమి చవి చూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఈ మ్యాచ్‌లో కసితో గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో ఉత్తమంగా ఆడుతున్న రాజస్థాన్ జట్టు.. కోల్‌కతా మీద విజయం సాధించింది. కావున, రాజస్థాన్ జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
RR vs RCB ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
యశస్వి జైస్వాల్ | బ్యాటింగ్ | 36 | 1122 | |
యుజ్వేంద్ర చాహల్ | బౌలర్ | 144 | 37 | 187 |
ఆర్.అశ్విన్ | ఆల్ రౌండర్ | 197 | 714 | 171 |
RR vs RCB ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు
ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్
మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్
లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ మరియు జాసన్ హోల్డర్
బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్
RR vs RCB ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ చేతిలో ఓడిన RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం బ్యాట్స్‌మెన్ మీదనేఆధారపడింది. అందులో కూడా ఓపెనర్లైన కోహ్లి, డుప్లెసిస్, మిడిల్ ఆర్డర్లో మాక్స్వెల్ మాత్రమే రాణిస్తున్నారు. వీరు అవుట్ అయితే ఆదుకోవడానికి మిగతా బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం సహకరించడం లేదు. బౌలర్లను సంబంధించి సిరాజ్ ఒక్కడు మాత్రమే బాగా ఆడుతున్నాడు. హర్షల్ పటేల్ పైన ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా సాధించలేకపోతున్నాడు. ముఖ్యంగా ముంబైతో జరిగిన మ్యాచులో.. బౌలర్లు మొత్తం చేతులెత్తేశారు. ప్రతి బౌలర్ 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటు ఇచ్చారు. 200 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ కేవలం 16 ఓవర్లలో సాధించిందంటే.. RCB బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు RCB జట్టులోని ముఖ్యమైన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.
RR vs RCB ప్రిడిక్షన్ 2023 : RCB బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
విరాట్ కోహ్లీ | బ్యాటింగ్ | 235 | 7062 | 4 |
మహ్మద్ సిరాజ్ | బౌలర్ | 77 | 97 | 75 |
గ్లెన్ మాక్స్వెల్ | ఆల్ రౌండర్ | 122 | 2703 | 31 |
RR vs RCB 2023 : RCB తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్: ఫఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) మరియు విరాట్ కోహ్లీ
- మిడిల్ ఆర్డర్: గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్)
- లోయర్ ఆర్డర్: మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ మరియు హర్షల్ పటేల్
- బౌలర్లు: వనిందు హసరంగా, కరణ్ షామా, జోస్ హేజిల్‌వుడ్ మరియు మహ్మద్ సిరాజ్
RR vs RCB 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.
ఆడిన మ్యాచ్‌లు | RCB గెలిచింది | RR గెలిచింది | ఫలితం లేదు |
30 | 15 | 12 | 00 |
ఈ మ్యాచ్‌లో రెండు జట్లలో ఎవరు గెలుస్తారో చెప్పాలంటే, బెంగుళూరుతో చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది వీరిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరగ్గా, ఇందులో రాజస్థాన్ విజయం సాధించింది. కావున, ఈ సారి RCB గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగులను సందర్శించండి. ఇక్కడ మీరు IPLకి సంబంధించిన ప్రతి రికార్డ్ గురించి సమాచారాన్ని పొందుతారు.