KKR vs SRH ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 19వ మ్యాచ్ ప్రివ్యూ
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 (KKR vs SRH Prediction 2023) : IPL సీజన్ 2023 చాలా ఉత్కంఠగా జరుగుతుంది. ఇందులో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లూ వారి చివరి మ్యాచుల్లో అద్భుత విజయాలు సాధించాయి. ఈ మ్యాచులో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని KKR అనుకుంటుండగా, రెండో విజయం సాధించి అభిమానులకు సంతోషం ఇవ్వాలని SRH భావిస్తుంది. మరి ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో, ఏ టీం ఓడిపోతుందో చూడాలి.
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- కోల్‌కతా నైట్ రైడర్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్
- వేదిక: ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)
- తేదీ & సమయం : ఏప్రిల్ 14 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 : హ్యాట్రిక్ విజయం కోసం KKR
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద 200 పై చిలుకు పరుగులు చేసిన KKR, వారిని 130 పరుగుల లోపే ఆలౌట్ చేసి దాదాపు 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో RCB బౌలర్లను ఊచకోత కోశాడు. అలాగే, పటిష్టమైన బౌలింగ్ కల్గిన గుజరాత్ టైటాన్స్ జట్టుపై KKR గెలిచిన తీరు అద్భుతమే అని చెప్పొచ్చు. చివరి ఓవర్లో 5 బంతుల్లో 5 సిక్సులు బాదిన KKR క్రికెటర్ రింకూ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. ముఖ్యంగా కోల్‌కతా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో సమిష్టిగా రాణిస్తూ ఉత్తమ విజయాలు నమోదు చేసింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపిఎల్ నుంచి తప్పుకున్నా కూడా.. నితీష్ రాణా కెప్టెన్సీలో టీం సూపర్ ఆడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మీద గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని KKR ఎదురు చూస్తుంది.
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
నితీష్ రాణా | బ్యాటింగ్ | 94 | 2251 | 7 |
సునీల్ నరైన్ | బౌలర్ | 151 | 1032 | 158 |
ఆండ్రీ రస్సెల్ | ఆల్ రౌండర్ | 101 | 2071 | 89 |
KKR vs GT ప్రిడిక్షన్ 2023 : KKR తుది 11 ఆటగాళ్లు
- ఓపెనర్ బ్యాటర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మన్దీప్ సింగ్
- మిడిల్ ఆర్డర్: నితీష్ రాణా, రింకూ సింగ్, అనుకుల్ రాయ్
- లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్
- బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ మరియు టిమ్ సౌథీ
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 : పాజిటివ్ దృక్పథంలో SRH జట్టు
మొదటి 2 మ్యాచుల్లో ఓడిన SRH, మూడో మ్యాచులో పంజాబ్ మీద సమిష్టిగా రాణించింది. ముఖ్యంగా, హైదరాబాద్ బౌలింగ్ ప్రతి ఐపిఎల్ సీజన్లలో చాలా బాగుంటుంది. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ వంటి వారి టాలెంట్ గుర్తించి కొన్ని SRH, వారు భారత జట్టుకు ఆడటానికి పరోక్షంగా సహాయం చేసిన SRH, ఈ సారి మాత్రం బౌలింగ్ సరిగ్గా వేయడం లేదు. అయితే, పంజాబ్ మీద సూపర్ బౌలింగ్ చేసి కట్టడి చేసిన తీరు బాగుంది. కేవలం శిఖర్ ధావన్ తప్ప మిగతా పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదనేది వాస్తవం. అలాగే, రాహుల్ త్రిపాఠి మరియు మార్క్రమ్ ఉత్తమ బ్యాటింగ్ చేసి SRH జట్టుకు ఈ ఐపిఎల్‌లో మొదటి విజయం అందించారు. అయితే, ఓపెనర్స్ అయిన మయాంక్ అగర్వాల్, కోట్లు కుమ్మరించి కొన్న హ్యారీ బ్రూక్ ఇప్పటి వరకూ అట్టర్ ఫ్లాప్ అవ్వడం SRH జట్టును నిరాశపర్చే విషయం. SRH జట్టులో ఉన్న టాప్ క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
KKR vs SRH ప్రిడిక్షన్ 2023 : SRH బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
మయాంక్ అగర్వాల్ | బ్యాటింగ్ | 116 | 2383 | |
భువనేశ్వర్ కుమార్ | బౌలర్ | 149 | 247 | 156 |
వాషింగ్టన్ సుందర్ | ఆల్ రౌండర్ | 54 | 335 | 33 |
SRH vs PBKS ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ
- మిడిల్ ఆర్డర్: రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్)
- లోయర్ ఆర్డర్: హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ (WK), వాషింగ్టన్ సుందర్
- బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
KKR vs SRH 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.
ఆడిన మ్యాచ్‌లు | KKR గెలిచింది | SRH గెలిచింది | టై |
23 | 15 | 8 | 0 |
ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో అద్భుత విజయాలు సాధించాయి. అయితే, వీరి గత రికార్డులను చూస్తే KKR పైచేయి ఉంది. మొత్తం 23 మ్యాచులు జరిగితే, అందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 15 మ్యాచ్స్ గెలవగా.. SRH 8 మ్యాచ్స్ గెలిచింది. అలాగే, గుజరాత్, బెంగళూరు వంటి పటిష్ట జట్లను ఓడించిన KKR, హైదరాబాద్ మీద కూడా గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.