CSK vs KKR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 61వ మ్యాచ్ ప్రివ్యూ
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 (CSK vs KKR Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరియు 7వ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 61వ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటి వరకూ వీరి మధ్య ఒక్క మ్యాచ్ జరగ్గా, అందులో చెన్నై విజయం సాధించింది. రెండవ సారి చెన్నై మరియు కోల్‌కతా మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కావున, ఇందులో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్‌కతా నైట్ రైడర్స్
- వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
- తేదీ & సమయం : మే 14 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 – 2వ స్థానంలో CSK
మొదట్లో విజయాలు, అపజయాలతో కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ప్రస్తుతం మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. మొత్తం 12 మ్యాచ్స్ ఆడగా, ఏడు విజయాలు మరియు 4 అపజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు కోల్‌కతాతో 13వ మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఇది కనుక గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కావున, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్యమైన బ్యాట్స్ మెన్, బౌలర్, ఆల్ రౌండర్స్ గురించి తెలుసుకుందాం.
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రుతురాజ్ గైక్వాడ్ | బ్యాటింగ్ | 47 | 1615 | |
తుషార్ దేశ్ పాండే | బౌలర్ | 18 | 21 | 23 |
రవీంద్ర జడేజా | ఆల్ రౌండర్ | 221 | 2615 | 148 |
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 : CSK తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
- మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
- లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
- బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 : 12 మ్యాచుల్లో 5 విజయాలు
మొదట్లో బాగానే ఆడిన KKR టీం ఆ తర్వాత చాలా ఘోరంగా ఆడుతుంది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోయిన తీరు KKRకు అత్యంత దరిద్రమైన ఓటమిగా భావించవచ్చు. 150 పరుగులు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు… కేవలం 13 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని చేధించింది. దీన్ని బట్టి చూస్తే, కోల్‌కతా బౌలింగ్ కొంచెం కూడా బాలేదని అర్థం అవుతుంది. ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన KKR, పరువును కాపాడుకోవాలన్నా, మిగిలిని మ్యాచుల్లో గెలవాలి. కావున, కోల్‌కతా యొక్క ముఖ్యమైన ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.
CSK vs KKR ప్రిడిక్షన్ 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
నితీష్ రాణా | బ్యాటింగ్ | 103 | 2529 | |
వరుణ్ చక్రవర్తి | బౌలర్ | 54 | 25 | 59 |
ఆండ్రీ రస్సెల్ | ఆల్ రౌండర్ | 110 | 2253 | 96 |
KKR vs RR ప్రిడిక్షన్ 2023 : KKR తుది 11 ఆటగాళ్లు
- ఓపెనర్ బ్యాటర్లు: నారాయణ్ జగదీసన్ మరియు రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్)
- మిడిల్ ఆర్డర్: వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా మరియు రింకూ సింగ్
- లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్ మరియు డేవిడ్ వైస్
- బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్
CSK vs KKR 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.
ఆడిన మ్యాచ్‌లు | చెన్నై గెలిచింది | KKR గెలిచింది | ఫలితం లేదు |
28 | 18 | 9 | 1 |
చివరగా రెండు జట్లను కనుక పరిశీలిస్తే, గెలిచే అవకాశాలు చాలా చెన్నై సూపర్ కింగ్స్ టీంకే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మరియు మ్యాచ్ జరిగే చెన్నై హోం గ్రౌండ్. అలాగే, గత రికార్డులు పరిశీలిస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 28 మ్యాచ్స్ జరిగాయి. ఇందులో చెన్నై 18 మ్యాచ్స్ గెలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్స్ గెలిచింది. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి.