LSG vs MI ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 63వ మ్యాచ్ ప్రివ్యూ
LSG vs MI ప్రిడిక్షన్ 2023 (LSG vs MI Prediction 2023) : లక్నో సూపర్ జాయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ జట్లు IPL 2023లో మొదటి సారి తలపడుతున్నాయి. రెండు జట్లకు ఇది ముఖ్యమైన మ్యాచుగా మిగలనుంది. ఎందుకుంటే, రెంటు టీమ్స్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే.. అది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, లక్నోకు ఈ సీజన్ బాగానే ఉంది, కానీ ముఖ్యమైన ప్లేయర్లు గాయాల పాలవడంతో ప్రదర్శన నెమ్మదించింది. ముంబయి ఇండియన్స్ మెల్ల మెల్లగా పుంజుకుని టైటిల్ రేసులోకి దూసుకొచ్చింది. రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఇప్పడు మన విశ్లేషణ చేద్దాం.
LSG vs MI ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్
- వేదిక: ఎకానా స్టేడియం (లక్నో)
- తేదీ & సమయం : మే 16 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
LSG vs MI 2023 : 11 మ్యాచుల్లో 5 గెలిచిన LSG
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొత్తం 11 మ్యాచ్స్ ఆడగా, అందులో 5 విజయాలను నమోదు చేసుకుంది. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ మీద గెలిస్తేనే లక్నో జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, సరైన సమయంలో లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం జట్టుకు చాలా దురదృష్టంగా చెప్పొచ్చు. జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం వల్ల టోర్నీలో ఆడలేకపోయాడు. ఈ విధంగా, ఉత్తమ బ్యాట్స్‌మెన్, బౌలర్స్ ఉన్నా.. అదృష్టం లేకపోవడంతో లక్నో జట్టు వెనకబడిపోతుంది. ఈ మ్యాచులో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకుంటుందా లేదా చూడాలి. కావున, లక్నో జట్టులోని ముఖ్యమైన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.
LSG vs MI ప్రిడిక్షన్ 2023 : లక్నో బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
నికోలస్ పూరన్ | బ్యాటింగ్ | 59 | 1204 | |
రవి బిష్ణోయ్ | బౌలర్ | 49 | 23 | 49 |
మార్కస్ స్టోయినిస్ | ఆల్ రౌండర్ | 79 | 1349 | 39 |
LSG vs MI 2023 : లక్నో తుది 11 ప్లేయర్స్
ఓపెనర్ బ్యాటర్లు: కైల్ మేయర్స్ మరియు మనన్ వోహ్రా
మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్
లోయర్ ఆర్డర్: ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా (కెప్టెన్)
బౌలర్లు: రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్ మరియు మొహ్సిన్ ఖాన్
LSG vs MI ప్రిడిక్షన్ 2023 : బ్యాట్స్‌మెన్ పైనే ముంబై భారం
ముంబయి ఇండియన్స్ 11 మ్యాచ్స్ ఆడగా, 6 మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల్లో ఓడింది. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ జట్టులో చాలా మంది ఉత్తమ బ్యాట్స్మెన్లు ఉన్నారు. మొదట్లో చాలా నెమ్మదిగా ఆడిన క్రికెటర్స్, ఇప్పుడు విజృంభిస్తున్నారు. బెంగుళూరుతో జరిగిన మ్యాచులో 200 స్కోరును కేవలం 16 ఓవర్లలోనే ముంబయి చేధించడాన్ని చూస్తేనే.. వారు ఎంత దూకుడుగా ఆడుతున్నారో తెలుస్తుంది. అయితే, బౌలింగ్ పరంగా చాలా మెరుగు కావలసిన అవసరం ముంబైకి ఉంది. ముఖ్యంగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చాలా మంది హార్డ్ హిట్టర్లు కలిగి ఉన్నారు. కావున, వారిని తక్కువ స్కోరుకు ఔట్ చేయాలంటే ఉత్తమంగా బౌలింగ్ వేయాలి. ఇప్పుడు, ముంబై ఇండియన్స్ యొక్క ముఖ్యమైన క్రికెటర్స్ గురించి చూద్దాం.
LSG vs MI ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రోహిత్ శర్మ | బ్యాటింగ్ | 239 | 6099 | 15 |
పీయూష్ చావ్లా | బౌలర్ | 170 | 609 | 176 |
కామెరాన్ గ్రీన్ | ఆల్ రౌండర్ | 12 | 277 | 6 |
LSG vs MI ప్రిడిక్షన్ 2023 : MI తుది 11 ఆటగాళ్లు
ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ మరియు తిలక్ వర్మ
లోయర్ ఆర్డర్: జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్ మరియు కుమార్ కార్తికేయ సింగ్
బౌలర్లు: పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్ మరియు అర్షద్ ఖాన్
LSG vs MI ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానితో ఒకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.
ఆడిన మ్యాచ్‌లు | లక్నో గెలిచింది | ముంబై గెలిచింది | ఫలితం లేదు |
2 | 2 | 0 | 0 |
చివరగా, ఏ జట్టు పైచేయి సాధిస్తుందో మనం విశ్లేషణ చేస్తే.. ముంబయి ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 2 సార్లు మ్యాచ్స్ జరిగాయి. రెండింట్లో కూడా ముంబయి మీద లక్నో విజయం సాధించింది. ఈ సారి ఎలాగైనా గెలవాలని ముంబై ఇండియన్స్ జట్టు భావిస్తుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ సందర్శించండి.