తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ | అగ్ర భారతీయ & విదేశీ జాబితా
Share

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ | అగ్ర భారతీయ & విదేశీ జాబితా

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ అంటే బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ (Best all rounder in IPL) వంటి 3 విభాగాల్లో నైపుణ్యాలు కలిగి ఉండాలి. కొంత మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసి నైపుణ్యం సాధిస్తే, మరికొందరు ప్లేయర్స్ బౌలింగ్ అద్భుతంగా చేస్తారు. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో నైపుణ్యం పొందిన క్రికెటర్లు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఒక జట్టులో ఇలాంటి ఆల్ రౌండర్స్ ఉంటే చాలా గుర్తింపు ఉంటుంది. IPL వంటి ట్వంటీ 20 టోర్నమెంట్లలో వీరికి చాలా డిమాండ్ ఉంటుంది. IPL సంబంధించి అన్ని సీజన్లలో కలిపి ఉత్తమ ఆల్ రౌండర్ ఎవరనే ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

రవీంద్ర జడేజా

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోసం అత్యంత ఉత్తమ ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఉంటాడు. 34 ఏళ్ల జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింట్లోనూ జట్టుకు మంచి ప్రదర్శన ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ అయిన రవీంద్ర జడేజా 7.63 బౌలింగ్ ఎకానమీతో 120 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలి సంవత్సరాలలో, జడేజా తన బ్యాటింగ్ స్థితిని చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు. ఫలితంగా, ఫ్రాంచైజీ అతనికి జట్టులో ఫినిషర్‌గా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది. బ్యాట్ మరియు బాల్‌తో అతని అద్భుతమైన నైపుణ్యంతో పాటు, తన ఫీల్డింగ్ ప్రమాణాలతో అపారమైన ప్రభావాన్ని సృష్టించాడు. అతని ఐపిఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 23 రనౌట్స్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2000+ రన్స్ మరియు 100+ వికెట్స్ సాధించిన ఏకైక ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. నిజం చెప్పాలంటే, జడేజా IPLలోని అత్యుత్తమ ఆల్ రౌండర్స్‌లో ఒకడిగా తప్పకుండా నిలుస్తాడు.

ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ ప్రపంచంలోని అత్యంత విధ్వంసకరమైన క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడు. తన ఆటతీరుతో ఓడిపోయే మ్యాచ్‌ను కూడా గెలుపు తీరాలకు చేర్చే సత్తా రస్సెల్‌కు ఉంది. IPLలో 500 కంటే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్లలో, రస్సెల్ ఎక్కువ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 180కి కలిగి ఉన్నాడు. అలాగే అతని అత్యత్తమమైన బౌలింగ్‌తో 68 వికెట్లు కూడా పడగొట్టాడు. వెస్టిండీస్ ప్లేయర్ అయిన రస్సెల్ తన ఐపీఎల్ కెరీర్‌ మొత్తంలో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉన్న గొప్ప ప్లేయర్లలో ఆండ్రీ రస్సెల్ తప్పకుండా ఉంటాడు. 

డ్వేన్ బ్రావో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి చూస్తే అత్యంత విజయవంతమైన ప్లేయర్లలో ఆటగాళ్లలో డ్వేన్ బ్రావో కూడా ఉన్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ అయిన బ్రావో ఐపీఎల్‌లో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో ప్రధానంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొత్తంలో 1500 రన్స్‌తో పాటు, 156 ఐపిఎల్ వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల లిస్టులో బ్రావో 3వ స్థానంలో ఉన్నాడు. అతను 2013 మరియు 2015 ఐపిఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్‌ కలిగి ఉన్నాడు. 37 సంవత్సరాల బ్రావో ఒక్క IPL సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. అతను IPL 2013లో 32 వికెట్లు సాధించి, ఒక IPL ఎడిషన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అతను 76 ఐపిఎల్ క్యాచ్‌లను పట్టుకున్నాడు. ఇవన్నీ గమనిస్తే, బ్రావో ఐపిఎల్ చరిత్రలో ఉత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఉంటాడు.

షేన్ వాట్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో షేన్ వాట్సన్ నిస్సందేహంగా ఒకడిగా నిలిచాడు. మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాడైన షేన్ వాట్సన్ అద్భుతమైన IPL కెరీర్‌ కలిగి ఉన్నాడు. అతను రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరపున ప్రధానంగా ఆడాడు. IPL కెరీర్‌లో 3874 పరుగులు మరియు 92 వికెట్లు సాధించాడు. 2008లో, వాట్సన్ మొదటి IPL ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అతను 2008లో అండర్‌డాగ్‌గా వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఆ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున 472 పరుగులు మరియు 17 వికెట్లు తీసుకున్నాడు. 2018 సంవత్సరంలో వాట్సన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. వారు మూడవ IPL టైటిల్‌ సాధించడంలో చాలా సహాయం చేశాడు.

కీరన్ పొలార్డ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్ని సీజన్లలో ఆల్ రౌండర్‌గా కీరన్ పొలార్డ్ ఎక్కువ ప్రభావాన్ని చూపాడు. 5 సార్లు ఐపిఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ విజయం వెనుక ఉన్న ముఖ్యమైన ప్లేయర్లలో పొలార్డ్ ఉంటాడు. ఇప్పటి వరకూ పొలార్డ్ ఆడిన మ్యాచుల్లో 151 స్ట్రైక్ రేట్‌తో 3667 పరుగులు చేశాడు. అలాగే, పొలార్డ్ 72 వికెట్లు తీశాడు. ఫీల్డింగులో పొలార్డ్ చాలా చురుగ్గా ఉంటాడు. ఇప్పటివరకు IPLలో 92 క్యాచ్స్ పట్టిన పొలార్డ్, ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా పొలార్డ్‌ని గుర్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

చివరగా, మీరు ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ (Best All-Rounder in IPL) సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు మరిన్ని క్రీడల గురించి తెలుసుకోవాలంటే ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి.

మరింత చదవండి: T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు | టాప్ 10 బ్యాట్స్‌మెన్లు

Star it if you find it helpful.
0 / 5

Your page rank: