తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 49వ మ్యాచ్ ప్రివ్యూ
Share

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 49వ మ్యాచ్ ప్రివ్యూ

CSK vs MI

MI vs CSK ప్రిడిక్షన్ 2023 (MI vs CSK Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య మరొక మ్యాచ్ జరగనుంది. ఎల్ క్లాసికో ఆఫ్ ఐపిఎల్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. ఇప్పటికే వీరి మధ్య ఒక మ్యాచ్ జరగ్గా, అందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాలని ముంబయి ఇండియన్స్ భావిస్తుంది. పాయింట్ల పట్టికలో చెన్నై 4వ స్థానంలో ఉండగా, ముంబయి ఇండియన్స్ 7వ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో ముంబై గెలిచి ట్రోఫీ రేసులో ఖచ్చితంగా నిలవాలని భావిస్తుంది. కావున, ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో మనం ఇప్పుడు అంచనా వేద్దాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్
  • వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
  • తేదీ & సమయం : మే 06 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : చివరి మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా MI

ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ 2023 ఐపిఎల్‌లో మొత్తం 8 మ్యాచ్స్ ఆడింది. అందులో 4 విజయాలు సాధించగా, 4 పరాజయాలను చవి చూసింది. అయితే, ఈ మ్యాచులో తప్పకుండా ముంబయి గెలిస్తేనే.. టైటిల్ రేసులో టాప్ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఒక వేళ ఓడిపోతే మాత్రం, మళ్లీ టైటిల్ రేసులోకి రావడానికి చాాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే, రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పైన ముంబై ఇండియన్స్ గెలిచిన విధానం మాత్రం సూపర్ ఉంది. మొదట రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి జట్టు, ఆ తర్వాత వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో ఫాంలో ఉంది. కావున, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయం సాధించడం అంత సులువు కాదని అర్థం అవుతుంది. ఇప్పుడు, మనం ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ముంబై ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 235 6063 15
పీయూష్ చావ్లా బౌలర్ 166 607 170
కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 8 243 5

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ముంబై తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు డెవాల్డ్ బ్రూయిస్

లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్స్ మరియు అర్జున్ టెండూల్కర్

బౌలర్లు: పీయూష్ చావ్లా, రిచర్డ్‌సన్ మరియు అర్షద్ ఖాన్

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – నాలుగవ స్థానంలో CSK

మూడు హ్యట్రిక్ విజయాలు సాధించి టాప్ స్థానంలోకి వచ్చిన చెన్నై.. తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి, మళ్లీ నాలుగవ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా పరిశీలిస్తే, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 200 స్కోరు చేసినా కూడా ఓడిపోవడం అనేది బౌలర్ల తప్పిదమే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఓపెనర్స్ నుంచి మొదలు పెడితే మిడిల్ ఆర్డర్ వరకూ.. బ్యాట్స్‌మెన్ అందరూ బాగానే ఉన్నా, బౌలర్స్ మాత్రం వరుసగా విఫలం అవుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో ఎక్కువగా హార్డ్ హిట్టర్స్ ఉంటారు. కావున, చెన్నై బౌలర్స్ మీద భారీ పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్యమైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 45 1561
తుషార్ దేశ్ పాండే బౌలర్ 16 21 21
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 219 2594 145

MI vs CSK 2023 : CSK తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
  • మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
  • లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
  • బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది చెన్నై గెలిచింది టై
35 20 15 0

చివరగా, ఈ మ్యాచ్‌లో ఎవరిని విజయం వరిస్తుందో చెప్పడం చాలా కష్టమైనది. ఇంతకు ముందు  రికార్డులను కూడా పరిశీలిస్తే, వారి మధ్య 35 మ్యాచ్‌లు ఆడితే, ఇందులో ముంబయి 20 మ్యాచ్‌లు గెలవగా, చెన్నై 15 మ్యాచ్‌లు గెలిచింది. మీకు IPLకి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు Fun88 బ్లాగ్స్ చదవవచ్చు. ఇక్కడ మీరు IPL యొక్క ప్రతి సమాచారాన్ని అలాగే ప్రతి మ్యాచ్ యొక్క అంచనాలను తెలుసుకుంటారు.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: