LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 46వ మ్యాచ్ ప్రివ్యూ
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 (LSG vs CSK Prediction) : IPL సీజన్ 2023 యొక్క 46వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 9 చొప్పున మ్యాచ్స్ ఆడగా, ఒక్కో జట్టు 5 మ్యాచ్స్ గెలిచి పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్నాయి. కావున, ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు చాలా ముఖ్యం. మే 1న RCBతో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. అలాగే, ఏప్రిల్ 30న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై ఓటమి పాలైంది. కావున, రెండు జట్లూ ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. కావున, లక్నో సూపర్ జెయింట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో ఎవరు విజయం సాధిస్తారో ఇప్పుడు విశ్లేషణ చేద్దాం.
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
- వేదిక: ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
- తేదీ మరియు సమయం: మే 4, 2023 మరియు 3:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : గెలుపు, ఓటములతో LSG జట్టు
IPL సీజన్ 2023 చూస్తే మాత్రం, గత 6 మ్యాచులు లక్నోకు సమాన గెలుపోటములు ఉన్నాయి. ఒక మ్యాచులో గెలిస్తే, మరొక మ్యాచులో ఓడిపోతుంది. వరుస విజయాలు సాధించడం LSG వల్ల కావడం లేదు. ఈ విధంగా ఉంటే టైటిల్ పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ నిలవడం కష్టం అవుతుంది. ముఖ్యంగా జట్టు ఆట ఒక మ్యాచులో అద్భుతంగా ఉంటే, మరొక మ్యాచులో దరిద్రంగా ఉంటుంది. RCBతో జరిగిన మ్యాచులో అయితే, స్వల్ప స్కోరును చేధించడం LSGకి కష్టంగా మారింది. కేవలం 126 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించడానికి LSG అష్ట కష్టాలు పడింది. RCB బౌలర్ల ధాటికి వరుసగా LSG వికెట్లు పడిపోయాయి. కేవలం 108 పరుగులకే ఆలౌల్ అయింది. కావున, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచులో అందరూ కలిసి సమిష్టిగా రాణిస్తేనే లక్నో విజయం సాధించే అవకాశం ఉంది.
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : లక్నో బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
కే.ఎల్. రాహుల్ | బ్యాటింగ్ | 118 | 4163 | |
రవి బిష్ణోయ్ | బౌలర్ | 46 | 19 | 49 |
మార్కస్ స్టోయినిస్ | ఆల్ రౌండర్ | 76 | 1299 | 39 |
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : తుది LSG 11 ఆటగాళ్లు
- ఓపెనర్ బ్యాటర్లు: కైల్ మేయర్స్ మరియు కె.ఎల్. రాహుల్ (కెప్టెన్)
- మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్
- లోయర్ ఆర్డర్: ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్
- బౌలర్లు: రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 – గత 2 మ్యాచుల్లో ఓడిన CSK
వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్‌లోకి దూసుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 200 స్కోర్ చేసినా కూడా, బౌలింగ్ వైఫల్యంతో ఓటమి చూడాల్సి వచ్చింది. చెన్నై బ్యాటింగ్ బాగానే ఉన్నా.. బౌలింగ్ మాత్రం సరిగ్గా వేయడం లేదు. 200 పరుగులు చేసినా కూడా విజయం సాధించలేకపోతుంది. కావున, లక్నో జట్టులో చాలా మంది హార్డ్ హిట్టర్లు ఉన్నారు. ఒక వేళ చెన్నై బౌలర్స్ సరిగా బౌలింగ్ వేయకపోతే LSG జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రుతురాజ్ గైక్వాడ్ | బ్యాటింగ్ | 45 | 1561 | |
తుషార్ దేశ్ పాండే | బౌలర్ | 16 | 21 | 21 |
రవీంద్ర జడేజా | ఆల్ రౌండర్ | 219 | 2594 | 145 |
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
- మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
- లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
- బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ
LSG vs CSK 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానితో ఒకటి ఎన్ని విజయాలు సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆడిన మ్యాచ్‌లు | చెన్నై గెలిచింది | రాజస్థాన్ గెలిచింది | ఫలితం లేదు |
2 | 1 | 1 | 0 |
చివరికి, ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనేది ఇద్దరి జట్ల ఆటగాళ్లను చూసి చెప్పడం చాలా కష్టం. ఇద్దరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమానంగా రాణిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఇంతకు ముందు 2 మ్యాచ్స్ జరగ్గా, ఒక సారి చెన్నై గెలవగా, మరొక సారి లక్నో విజయం సాధించింది. మీకు మ్యాచ్స్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే Fun88 బ్లాగ్ చూడండి. ఇక్కడ మీరు IPL యొక్క ప్రతి సమాచారం మరియు ప్రతి మ్యాచ్ యొక్క అంచనాలను తెలుసుకుంటారు.
LSG vs CSK ప్రిడిక్షన్ 2023 (LSG vs CSK Prediction) – FAQs:
1: ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని మ్యాచ్స్ గెలిచింది?
A: చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 9 మ్యాచ్స్ ఆడగా, 5 మ్యాచుల్లో విజయం సాధించింది.
2: ఈ సీజన్‌లో ఇప్పటికీ లక్నో ఎన్ని మ్యాచ్స్ గెలిచింది?
A: లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ 9 మ్యాచులు ఆడింది. అందులో 5 మ్యాచుల్లో విజయం సాధించింది.
3: రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎన్ని ఉన్నాయి?
A: రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే, 2 మ్యాచుల్లో ఒక సారి చెన్నై విజయం సాధించగా, మరొక సారి లక్నో విజయం సాధిచింది.