ipl కొత్త నియమాలు 2023 : టాస్, వైడ్, నోబాల్ రివ్యూ, ఇతర వివరాలు
ipl కొత్త నియమాలు 2023 (ipl new rules 2023) : మరొక మూడు రోజుల్లో ఐపిఎల్ సీజన్ మొదలవుతుంది. మార్చి 31 నుంచి మొదలు కానున్న 16వ సీజన్ దాదాపు 2 నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం అందిస్తుంది. గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే, ఈ సారి ఐపిఎల్ సీజన్ సంబంధించి బిసిసిఐ చాలా మార్పులు చేసింది. వైడ్ బాల్, నోబాల్ సమీక్షలు, పవర్ల ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు, టాస్ వేసిన తర్వాత తుది జట్టు ప్రకటన, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్.. ఇలా ఈ లీగ్‌లో చాలా మార్పులు ఉన్నాయి. ipl కొత్త నియమాలు 2023 సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ipl కొత్త నియమాలు 2023 : గ్రూప్ స్టేజీ మ్యాచుల్లో మార్పులు
గత సీజన్ నుంచి ఐపిఎల్‌లో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 10 జట్లను 2 గ్రూప్స్‌గా విభజించి, ఒక్క గ్రూప్‌లో 5 టీమ్స్ ఉన్నాయి. అంతకు ముందు ఐపిఎల్ సీజన్ ప్రదర్శన ఆధారంగా జట్లకు ర్యాంకులు ఇచ్చేవారు. లీగ్ స్టేజీలో ఒక జట్టు.. తన గ్రూపులో ఉన్న మిగిలిన 4 జట్లు, అవతలి గ్రూపులో సమాన ర్యాంకు కలిగిన జట్టుతో రెండేసి చొప్పున మ్యాచులు ఆడేది. మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడేది. మొత్తంగా ప్లే ఆఫ్స్ ముందు ఒక జట్టు 14 మ్యాచ్స్ ఆడేది. అయితే, ఈ సారి కూడా 14 మ్యాచులే ఆడుతుంది. కానీ, అవతలి గ్రూపులోని 5 జట్లతో రెండేసి చొప్పున మ్యాచ్స్, తన గ్రూపులో ఉన్న మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఉదాహరణకు గ్రూపు A లో ఉన్న ముంబయి ఇండియన్స్ జట్టు, గ్రూప్ B లో ఉన్న 5 జట్లు అయిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో రెండేసి చొప్పున మొత్తం 10 మ్యాచ్స్ ఆడుతుంది. అలాగే, గ్రూపు Aలో ఉన్న మిగిలిన 4 టీమ్స్ అయిన లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున 4 మ్యాచ్స్ ఆడుతుంది.
ipl కొత్త నియమాలు 2023 : టాస్ తర్వాతే తుది జట్టు ఎంపిక
ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఐపిఎల్ సీజన్లలో టాస్ వేసే ముందు మాత్రమే తుది జట్టును ప్రకటించేవారు. తుది 11 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన తర్వాతే టాస్ వేయడం ఆనవాయితీగా వచ్చింది. అయితే, ఇప్పుడు మాత్రం టాస్ వేసిన తర్వాత తుది జట్టును ఎంచుకునే అవకాశాన్ని జట్లకు బిసిసిఐ కల్పిస్తుంది. దీని వల్ల పిచ్ స్వభావాన్ని బట్టి రెండు జట్లు ఏయే ప్లేయర్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు పిచ్ స్వభావం బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే, దాన్ని బట్టి ప్లేయర్లను తీసుకుంటారు. అలాగే, ఓడిపోయిన జట్టు కూడా పిచ్ కండిషన్ ప్రకారం తుది జట్టును ఎంచుకుంటుంది. ఇది ఇరు జట్లకు సమానమైన ప్రయోజనం చేకూరే విధానం అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ipl కొత్త నియమాలు 2023 : 5 పరుగుల జరిమానా
బౌలర్ బాల్ వేసే సమయంలో ఫీల్డర్స్, వికెట్ కీపర్ కావాలని కదిలితే, ఫీల్డింగ్ జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధించే నిబంధనను కూడా బిసిసిఐ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, ఆ బాల్‌ను కూడా డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. అలాగే, నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను పూర్తి చేయకపోతే, సర్కిల్ బయట ఐదుగురు ఆటగాళ్లను బదులు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు.
ipl కొత్త నియమాలు 2023 : వైడ్ బాల్, నో బాల్ కోసం రివ్వూ
ఇప్పటి వరకూ ఐపిఎల్‌లో బ్యాట్స్ మెన్ ఔట్ సంబంధించి మాత్రమే రివ్యూ పద్ధతిని కొనసాగించేవారు. ఈ సీజన్ నుంచి మాత్రం వైడ్ బాల్, నో బాల్ సంబంధించి కూడా రివ్యూ కోరే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దీనిని అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో పురుషుల ఐపిఎల్‌లో కూడా ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వైడ్ బాల్, నోబాల్ సంబంధించి కొన్ని సార్లు అంపైర్ల నిర్ణయాలు కూడా తప్పు అయ్యాయి. ముఖ్యంగా టి20 మ్యాచ్ సంబంధించి ఒక్క పరుగు తేడాతో కూడా ఓడిపోయిన జట్లు కూడా చాలా ఉన్నాయి. వైడ్ బాల్, నో బాల్ సంబంధించి అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల గెలిచే జట్లు కూడా ఓడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కావున, వైడ్ బాల్ మరియు నోబాల్ మీద రివ్వూ అనేది ఇరు జట్లకు లాభం చేకూరుస్తుంది.
ipl కొత్త నియమాలు 2023 : ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలు
ఐపిఎల్ మొదలు కాక ముందే ఇంపాక్ట్ ఆటగాడు అనే నిబంధన గురించి చాలా చర్చ జరుగుతుంది. దీని వల్ల గేమ్ చాలా రసవత్తరంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు. అసలు ఇంపాక్ట్ ఆటగాడు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యాచ్ మొదలయ్యే ముందు ప్రతి జట్టు తుది 11 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకుంటుంది. అదే విధంగా నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్‌ను కూడా ఎంపిక చేసుకునే అవకాశం జట్టుకు ఉంది. ఆ 4గురు సబ్ స్టిట్యూట్ ప్లేయర్ల నుంచే ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులో ఆడించవచ్చు. ఈ ఆటగాడినే ఇంపాక్ట్ ప్లేయర్ అని అంటారు. అయితే, 11 మంది ఉన్న తుది టీంలో విదేశీ ప్లేయర్స్ నలుగురు ఉంటే, అప్పుడు ఇంపాక్ట్ ఆటగాడిగా భారత క్రికెటర్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఒక వేళ విదేశీ ఆటగాళ్లు ముగ్గురు ఉంటే, అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా విదేశీ క్రికెటర్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, 11 మంది ఉన్న తుది జట్టులో ఖచ్చితంగా నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి.
ipl కొత్త నియమాలు 2023 : ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకునే విధానం
ఐపిఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకునే విధానాన్ని కూడా బిసిసిఐ మార్చింది. తుది జట్టులో ప్రకటించిన ప్లేయర్ స్థానంలో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఇంపాక్ట్ ఆటగాడిని తీసుకోవచ్చు. ఒక వేళ చేజింగ్ చేసేటప్పుడు బ్యాట్స్ మెన్ కావాలనుకుంటే, బౌలర్ స్థానంలో బ్యాట్స్ మెన్‌ను తీసుకోవచ్చు. బౌలింగ్ వేసేటప్పుడు స్పిన్ బౌలర్ కావాలనుకుంటే బ్యాట్స్ మెన్ స్థానంలో బౌలర్‌ను తీసుకోవచ్చు. అయితే, ఒక్క సారి ఇంపాక్ట్ ప్లేయర్ కోసం మైదానం వీడిన ఆటగాడు మళ్లీ మ్యాచులో ఆడే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యే ముందు, ఓవర్ పూర్తి అవ్వడం, వికెట్ పడటం, బ్యాట్స్ మెన్ రిటైర్ అయిన తర్వాతే ఇంపాక్ట్ ఆటగాడు గ్రౌండ్‌లోకి రావాలి. అలాగే బౌలర్ 2 ఓవర్స్ వేసిన తర్వాత, అతని స్థానంలో బౌలింగ్‌కు వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ మొత్తం 4 ఓవర్లు వేయొచ్చు.
ipl కొత్త నియమాలు 2023 : హోం గ్రౌండ్స్, బయట గ్రౌండ్స్‌లో మ్యాచ్స్
ఈ సారి జరిగే మ్యాచ్స్ అన్నీ హోం గ్రౌండ్స్, బయట గ్రౌండ్స్‌లో జరుగుతున్నాయి. అయితే, ఇది కొత్తది ఏం కాకపోయినా.. దాదాపు మూడేళ్ల తర్వాత దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మ్యాచ్స్ జరుగుతున్నాయి. కరోనా కారణంగా 2020 ఐపిఎల్ మొత్తం దుబాయిలో జరిగింది. అలాగే 2021 సీజన్ సగం దుబాయిలో, సగం ఇండియాలో జరిగింది. 2022 ఐపిఎల్ భారత్‌లో జరగ్గా, కేవలం ముంబయి, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు మాత్రమే ఆతిథ్యం ఇచ్చాయి. ఈ సారి ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, మొహాలీ, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గౌహతి, ధర్మశాల నగరాల్లో మ్యాచ్స్ జరగనున్నాయి.
ipl కొత్త నియమాలు 2023 : మినీ వేలంలో జట్లు మారిన ఆటగాళ్లు, కెప్టెన్లు
ఐపిఎల్ మినీ వేలం తర్వాత కొందరు ముఖ్యమైన ఆటగాళ్లు జట్లు మారిపోయారు. వారిలో కొందరిని చూస్తే, ఇంగ్లాండ్ యువ క్రికెటర్ సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్ 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరొక ఇంగ్లాండ్ స్టారన్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లకు కొన్నది. అలాగే గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్, ఈ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు ఆడనున్నాడు. రిషబ్ పంత్ గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్, సన్ రైజర్స్ కెప్టెన్‌గా మార్‌క్రమ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా నితీష్ రాణా ఉన్నాడు.
ipl కొత్త నియమాలు 2023 (ipl new rules 2023) సంబంధించి మీరు ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు ఇలాంటి మరిన్ని ipl సమాచారం కావాలంటే ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయడానికి ఉత్తమ ప్లాట్‌ఫాంగా Fun88 విశ్వసనీయమైనది.