1975 నుండి 1996 : క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర వివరాలు
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర (Cricket World Cup History) ICC ప్రపంచకప్ అనేది ఎలాంటి సందేహం లేకుండా, క్రీడల ప్రపంచంలో ఎక్కువ జనాదరణ కలిగిన టోర్నమెంట్. ఇది మొదట 1975వ సంవత్సరంలో మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు.
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర – వెస్టిండీస్ జట్టు : 1975
- ప్రముఖ ఆటగాడు క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో, వెస్టిండీస్ టోర్నమెంటును గ్రాండుగా గెలవడంతో ఉత్తమ జట్టుగా ఉంది.
- ఆస్ట్రేలియా మీద జరిగిన ఫైనల్ మ్యాచులో, మొదట నిరాసక్తత చూసిన విండీస్, కెప్టెన్ అద్భుత సెంచరీ కొట్టడంతో మంచి స్కోరు చేసింది.
- రోహన్ కన్హైతో కలిసిన అతడు వంద పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పారు. వెస్టిండీస్ 291/8 స్కోరు చేసింది. అలాగూ వెస్టిండీస్ బౌలింగ్ కూడా సూపర్ ఉంది.
- కీత్ బోయ్స్ 4 వికెట్స్ తీశాడు. ఐదు రన్ అవుట్స్, సర్ వివియన్ రిచర్డ్స్ 3 వికెట్స్ తీయగా, ఆస్ట్రేలియా 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
- వెస్టిండీస్ మొదటి ప్రపంచ కప్ గెల్చుకొని రికార్డు సృష్టించింది.
క్రికెట్ వరల్డ్ కప్ – వెస్టిండీస్ జట్టు : 1979
- వెస్టిండీస్ దేశం 1979 వరల్డ్ కప్ కూడా గెలవడంతో. వారు తమ టైటిల్‌ను మళ్లీ సాధించి కాపాడుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో వారి ఆధిపత్యం మరోసారి ప్రదర్శించారు.
- ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ దేశం మీద సర్ వివియన్ రిచర్డ్స్ అజేయ 138 పరుగులు చేయగా, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు.
- కొల్లిస్ కింగ్ కూడా 66 బంతుల్లోనే 86 రన్స్ చేయగా వెస్టిండీస్ 286/8 స్కోరు చేయగలిగింది.
- బౌలింగ్ పరంగా కూడా వారు చాలా విజృంభించారు. జోయెల్ గార్నర్ 5 వికెట్స్ పడగొట్టాడు.
- విండీస్ బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వెస్టిండీస్ మరో సారి లార్డ్స్ క్రికెట్ గ్రౌండులో ప్రపంచ విజేత అయింది.
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర – ఇండియా జట్టు : 1983
1983లో ఇండియా జట్టు తొలి సారి వరల్డ్ కప్ ట్రోఫీ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. భారతదేశంలో క్రికెట్ అభివృద్ధఇకి ఇది కీలక టర్నింగ్ పాయింట్‌గా ఉంది. ఇండియా కేవలం 183 పరుగుల టార్గెట్ మాత్రమే వెస్టిండీస్ జట్టకు విధించింది. వరసగా మూడవ వరల్డ్ కప్ కూడా సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న వెస్టిండీస్ జట్టుకు భారత బౌలర్లు దిమ్మ తిరిగేలా చేశారు. ఇండియా బౌలర్స్ ఉత్తమ ఆట తీరు ప్రదర్శించి 43 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర – ఆస్ట్రేలియా జట్టు : 1987
1987లో ఆస్ట్రేలియా జట్టు యొక్క ఖచ్చిత ప్రణాళిక, సమగ్రమైన వ్యూహం వల్ల తొలి వరల్డ్ కప్ విజయం లభించింది. వారి గెలుపు బౌలర్స్ మరియు బ్యాట్స్ మెన్స్ నుంచి స్థిరంగా ఆడటం వల్ల సాధ్యమైంది. అలెన్ బోర్డర్ నాయకత్వంలో డేవిడ్ బూన్ 125 బంతుల్లోనే 75 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 253 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ కూడా దాదాపు వారి లక్ష్యాన్ని ఛేధించడానికి చాలా ప్రయత్నించగా, కొద్ది దూరంలో 7 పరుగులతో ఓటమి పాలైంది. దీని వల్ల ఆస్ట్రేలియా గెలిచి వరల్డ్ కప్ సాధించుకుంది.
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర – పాకిస్తాన్ జట్టు : 1992
1992లో పాకిస్తాన్ విజయం అనేది పాక్ జట్టుకు చాలా బలం చేకూర్చింది. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో దరిద్రంగా మొదలైన పాక్ ప్రారంభం ఆ తర్వాత వరల్డ్ కప్ గెలవడానికి దారులు వేసుకుంది. ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ 249/6 పరుగులు చేసి ప్రత్యర్ధి జట్టుకు ఉత్తమ స్కోర్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇమ్రాన్ ఖాన్ టాప్ స్కోర్ 72గా నిలిచాడు.. ప్రతిస్పందనగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ జట్టు యొక్క అద్భుత బౌలింగ్ వల్ల టార్గెట్ చేధించలేకపోయింది. వసీం అక్రమ్ 3/49తో ఉత్తమ బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లను 227 పరుగులకే కట్టడి చేశారు. దీంతో 22 పరుగుల తేడాతో పాకిస్తాన్ దేశం మొదటి సారి వరల్డ్ కప్ గెల్చుకుంది.
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర – శ్రీలంక జట్టు : 1996
అర్జున రణతుంగ కెప్టెన్సీలో మరియు గేమ్ కోసం శ్రీలంక జట్టు యొక్క ఉత్తమ ఆటతీరు, కలిసికట్టుగా పోరాడిన విధానం వారికి మొదటి వరల్డ్ కప్ అందించింది. ఆస్ట్రేలియా జట్టులో మార్క్ టేలర్ 74 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా టీం ఫైనల్ మ్యాచులో 241/7 లక్ష్యాన్ని శ్రీలంక జట్టుకు నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రీలంక ఇద్దరు ఓపెనర్స్ కోల్పోయినా, అరవింద డి సిల్వా యొక్క అద్భుత సెంచరీతో 22 బంతులు మిగిలి ఉండగా గెలిచి మొదటి సారి ప్రపంచ కప్ ముద్దాడింది.
మీరు క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర (Cricket World Cup History) వివరాలు ఈ ఆర్టికల్ చదవి తెలుసుకున్నారు కదా! మీరు ఇటువటి క్రికెట్ సంబంధించి వార్తలకు ప్రముఖ బ్లాగ్ Fun88 (ఫన్88) చూడండి.